పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. నేషనల్ కాదు పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ ఆ సినిమాలొ డైలాగ్ చెప్పడమే కాదు ప్రస్తుతం ఆయన రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. అందుకే అట్లీ తో మూవీని అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్థాయిలోనే అనౌన్స్ చేసి అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారంతో పాటుగా అల్లు అర్జున్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తారనే ప్రచారము జరిగింది. తాజాగా అల్లు అర్జున్ పక్కన జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ సరసన మృణాల్ ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అంటున్నారు.
మరి అదే నిజమైతే మృణాల్ ఠాకూర్ పంట పండినట్లే. ఇక ఒక హీరోయిన్ మృణాల్ అయినప్పటికి మిగతా హీరోయిన్స్ ని బాలీవుడ్ నుంచే తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున సరసన మృణాల్ ఠాకూర్ పేరు మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.