పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్రేకిచ్చినా ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అని ప్రతిసారి నిరూపణ అవుతూనే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీపడ్డారు, పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల రిలీజ్ లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా ఆ సినిమాలపై బోలేడన్నిఅంచనాలు కనిపిస్తున్నాయి.
పవన్ కూడా తాను డబ్బులు కోసమే సినిమాలు చేస్తున్నా అన్నారు. దానితో పవన్ పై దర్శకనిర్మాతల్లో హోప్స్ మొదలయ్యాయి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పూర్తి చెయ్యాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్ళు చెదిరే కాదు రికార్డ్ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు ఏకంగా 170కోట్ల పారితోషికం ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఈ రేంజ్ పారితోషికాలు బాలీవుడ్ లో నడుస్తాయి కానీ.. ఇక్కడ మాత్రం రేర్ అనే చెప్పాలి, పాన్ ఇండియా స్టార్స్ కూడా తీసుకొని విధంగా పవన్ కి ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం రికార్డ్ బ్రేక్ అంటూ అందరూ మాట్లాడుకునున్నారు.