Advertisementt

కవిత-కేటీఆర్ కోల్డ్ వార్ పై హరీష్ కామెంట్స్

Sat 26th Apr 2025 11:34 AM
ktr  కవిత-కేటీఆర్ కోల్డ్ వార్ పై హరీష్ కామెంట్స్
Harish Rao comments on Kavitha-KTR cold war కవిత-కేటీఆర్ కోల్డ్ వార్ పై హరీష్ కామెంట్స్
Advertisement
Ads by CJ

గత పదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో ఆయన పిల్లలు కవిత, కేటీఆర్ ఎవరి రాజకీయం వారు కాకుండా తండ్రి బాటలో నడిచారు నేతలుగా ఎదిగారు. కేటీఆర్ ఐటి మినిస్టర్ గా హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడితే.. కవిత ఎమ్యెల్సీగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపింది. ఇక తెలంగాణ కేసీఆర్ హావ ముగిసి కాంగ్రెస్ అందులోను రేవంత్ పాలన మొదలయ్యాక హరీష్ రావు కెసిఆర్ నుంచి విడిపోతున్నాడు. కాదు కాదు బీఆరెఎస్ లోనే హరీష్ రావు మామకు చెక్ పెడుతున్నాడనే వార్తలు నడిచాయి. 

ఈమధ్య కాలంలో కేటీఆర్ ని కాకుండా కేసీఆర్ కవితకు పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారు, సమయానుకూలంగా కవితను అందలం ఎక్కిస్తారనే టాక్ తో పాటుగా అన్న కేటీఆర్ ను తొక్కేందుకు కవిత స్కెచ్ లు వేస్తుంది, కవితకు కేటీఆర్ కి నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. 

తాజాగా హరీష్ రావు ఓ ఇంటర్వ్యూలో కవిత-కేటీఆర్ నడుమ కోల్డ్ వార్ అనే ప్రచారం కేవలం సోషల్ మీడియా మాయ మాత్రమే అని కొట్టిపారేశారు, కేటీఆర్ కానీ, కవిత కానీ ఎవ్వరు కేసీఆర్ గారు చెప్పిన గీత దాటరు, వారి మధ్యన గొడవ అనేది సోషల్ మీడియా సృష్టి అని తేల్చేసారు. అంతేకాకుండా తానెప్పటికీ బీఆరెఎస్ నేతనే అని, అక్కడే తన రాజకీయ జీవితం ముడిపడి ఉంది అంటూ హరీష్ కుండబద్దలు కొట్టారు. 

Harish Rao comments on Kavitha-KTR cold war:

No Cold War Between KTR and Kavitha Says Harish Rao

Tags:   KTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ