ఆస్కార్ విజేత, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ చిక్కుల్లో పడ్డారు. ట్యూన్స్ కాపీ కొట్టారంటూ ఆయనపై ఢిల్లీ హై కోర్టులో సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్ పిటీషన్ వేసాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో వీరా రాజ వీరా కోసం రెహమాన్ ఇచ్చిన ట్యూన్స్ ని కాపి కొట్టారంటూ ఆయనపై కేసు వేశారు ఫయాజ్.
తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి రెహమాన్ వీరా రాజ వీరా సంగీతాన్ని కాపీ కొట్టారని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఢిల్లీ హై కోర్టు తాజాగా తీర్పుని వెలువరించింది. ఇరు వర్గాలవాదనలు విన్న కోర్టు రెహమాన్ కి బిగ్ షాక్ ఇచ్చింది.
ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్ పిటీషన్‌దారుడు సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్ కి రూ.2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునివ్వడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పెద్ది చిత్రానికి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే వారిలో ఎక్కడ లేని హైప్ మొదలైంది. కానీ ఇప్పుడు రెహమాన్ కాపీ ట్యూన్స్ తో దొరికిపోవడంతో వారిలో కంగారు మొదలైంది.