నటుడు నాగబాబు జనసేనలో కీలక నేతగా మారడమే కాదు, తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక జనసేనను ముందుండి నడిపించారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కోసం చంద్రబాబు తో మాట్లాడి ఎమ్యెల్సీ ఇప్పించారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణమైన వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుకు క్వైట్ అపోజిట్ గా నాగబాబు తీరు ఉంటుంది.
జనసేన ఫార్మేషన్ డే సమయంలోనే నాగబాబు జనసేన కష్టపడి గెలుపు సాధించింది, పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎవరూ కారణం కాదు, ఒకవేళ తామే కారణమనుకుంటే అది వారి ఖర్మ అంటూ వర్మ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసారు. ఆతర్వాత ఎమ్మెల్సీ అయ్యాక కూడా నాగబాబు వర్మను పట్టించుకోకుండా పిఠాపురం నియోజకవర్గంలో తిరిగారు. అప్పటికే నాగబాబు పై వర్మ వర్గంలో వ్యతిరేఖత మొదలైంది.
ఈ పరిస్థితిని పవన్ ఎలా చక్కబెడతారో, వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉంటుందో, అన్న నాగబాబు కోసం పవన్ కూడా వర్మను పక్కన పెడతారేమో అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా 100 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేసారు. ఆ సందర్భంలో టీడీపీ నేత వర్మను ముందుకు పిలిచి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
వర్మ కూడా ఎలాంటి ఈగో లేకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి పిఠాపురంలో పర్యటించారు. పవన్ వర్మతో ప్రవరిస్తున్న తీరు చూసి, నిన్న జరిగిన సంఘటనలు చూసాక నాగబాబు కు, పవన్ కు మధ్యలో ఎంత తేడా, వర్మను పవన్ కావాలనుకుంటుంటే నాగబాబు దూరం పెడుతున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.