రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని జపాన్ లో ప్రమోట్ చెయ్యడానికి వెళ్లిన సందర్భంలో ఆయన తనకిష్టమైన ఫుడ్ గురించి, హైదరాబాద్ లో బెస్ట్ రెస్టారెంట్స్ గురించి చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరూ చూసారు. అందులో ఎన్టీఆర్ నాగ చైతన్య రెస్టారెంట్ షోయు గురించి ప్రత్యేకంగా మాట్లాడం హాట్ టాపిక్ అయ్యింది.
నాగ చైతన్య రెస్టారెంట్ షోయులో జాపనీస్ ఇష్టపడే ఫుడ్ సూషి చాలా బావుంటుంది అంటూ ఎన్టీఆర్ చెప్పడం చూసిన అక్కినేని అభిమానులే కాదు నాగ చైతన్య కు చాలా ఆనందంగా అనిపించిందట. అదే విషయాన్ని నాగ చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పదించారు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ షోయు రెస్టారెంట్ లో జాపనీస్ ఇష్టపడే ఫుడ్ సూషి చాలా బావుంటుంది అని చెప్పిన వీడియో చూసి చాలా హ్యాపీగా అనిపించింది.
ఎన్టీఆర్ మా రెస్టారెంట్ గురించి మట్లాడారు, థాంక్స్ టు ఎన్టీఆర్ అంటూ నాగ చైతన్య ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్..నీల్ తో కలిసి డ్రాగన్ మూవీ సెట్ లో ఉండగా, నాగ చైతన్య NC 24 కోసం రెడీ అవుతున్నారు.