యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. మూడు రోజుల క్రితమే అంటే ఏప్రిల్ 22 నుంచి బెంగుళూర్ కి దగ్గరలో మొదలైన డ్రాగన్ సెకండ్ షెడ్యూల్ సెట్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అయ్యారు. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో పై మైత్రి నిర్మాతలు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ ఇస్తున్న అప్ డేట్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.
అయితే ఈచిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లుగా వార్తలు రావడమే కానీ అధికారికముగా చెప్పింది లేదు. అదలాఉంటే ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ చిత్రంలో కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ కి స్పెషల్ సాంగ్ చేసే అవకాశమొచ్చినట్లుగా సోషల్ మీడియా టాక్.
గతంలోనూ శృతి హాసన్ మహేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే నీల్ సలార్ లో ఆమె హీరోయిన్. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో కూడా చేస్తే అది పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవడం మాత్రం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి నిజంగా శృతి హాసన్ కి ఆ ఛాన్స్ దక్కేనా అనేది ఇప్పుడు ఆమె అభిమానుల్లో కనిపిస్తున్న క్యూరియాసిటి.