తండేల్ చిత్రం సక్సెస్ తర్వాత నాగ చైతన్య ఓ వెబ్ సీరీస్ ని పూర్తి చేసేసాడు. ఇక ఫిబ్రవరిలో విడుదలైన తండేల్ తో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్బులోకి అఫిషియల్ గా అడుగుపెట్టాడు. ఆ చిత్రం తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో NC 24 ని అనౌన్స్ చేసాడు. ఆ చిత్ర షూటింగ్ రీసెంట్ గానే మొదలైనట్టుగా తెలుస్తుంది.
తాజాగా నాగ చైతన్య ఓ ఫుడ్ బ్లాగర్ ఇంటర్వ్యూలో సరదాగా అనుకోకుండా కార్తీక్ దండు తో చేస్తున్న NC 24 చిత్ర టైటిల్ ని రివీల్ చేసాడు. దానితో ఆ టైటిల్ ని మ్యూట్ చేసేసారు సదర ఇంటర్వ్యూ నిర్వాహకులు. మైథలాజికల్ త్రిల్లర్ గా భారీ విఎఫెక్స్ తో NC 24 ఉంటుంది. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 14 నుంచి మొదలవుతుంది అంటూ ఫ్లోలో NC 24 టైటిల్ రివీల్ చేసేసాడు చైతు.
దానితో షాకైన సదరు యాంకర్ ఏంటి సర్ టైటిల్ చెప్పేసారు.. ఓ అవును కదా సారీ అంటూ నోరు జారిన చైతు తనని తాను తమాయించుకోవడంతో ఆ యాంకర్ ఏంటండీ చిరు లీక్స్ లా మీరు కూడా చైతు లీక్స్ ఇస్తున్నారా అంటూ సరదాగా ఆటపట్టించిన వీడియో వైరల్ అయ్యింది.