నిన్నటివరకు పిఠాపురం వర్మ జనవసేనకు ఎగైనెస్ట్ గా మారిపోయారు, పవన్ కళ్యాణ్ ఇంకా నాగబాబు కు వర్మ నుంచి సహకారం ఉండదు, వర్మ కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేఖంగా పిఠాపురంలో ప్రతి గడప కు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు, పిఠాపురంలో కూటమి మైత్రి చెడింది, కూటమి ప్రభుత్వంలో మొదటి వ్యతిరేఖత పిఠాపురం నుంచే మొదలైంది.
నాగబాబు ఎమ్యెల్సీ అయ్యాక పిఠాపురంలో వర్మ వర్గీయులు vs నాగబాబు వర్గీయులు అన్న రేంజ్ లో గొడవలు హైలెట్ అయ్యాయి, దానితో కూటమిలో బీటలు అంటూ బ్లూ మీడియాతో పాటుగా వైసీపీ నేతలు కూడా చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. బ్లూ మీడియా అయితే టీడీపీ నేత వర్మ విషయంలో రోజుకో వార్త వండి వారుస్తుంది.
కానీ తాజాగా వర్మ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో పవన్ పక్కనే కనిపించడంతో బ్లూ మీడియాకి దిమ్మతిరిగింది. టీడీపీ హై కమాండ్ ఆజ్ఞానుసారం వర్మ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో యాక్టీవ్ గా కనిపించారు. పవన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనగా ప్రతి సందర్భంలో వర్మ పవన్ పక్కనే కనిపించడంతో బ్లూ మీడియా గొంతులో పచ్చివెలక్కాయ పడింది.