అసలు సినిమాని ఈ తేదికి రిలీజ్ చేస్తామని ఊరించడం, తర్వాత షూటింగ్ పూర్తి కాలేదనో, లేదంటే ఇతర కారణాల చేతో సినిమాలను వాయిదా వెయ్యడం పరిపాటే. కానీ సినిమాని వాయిదా వేస్తున్న విషయం చెప్పకపోతే ఎలా. అందులోను భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తారు.
ఈ నెలలో అంటే ఏప్రిల్ లో విడుదల కావాల్సిన అనుష్క ఘాటీ కానివ్వండి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కానివ్వండి.. ఏ ఒక్క దర్శకనిర్మాత సినిమాలు పోస్ట్ పోన్ అయిన విషయాలు చెప్పకుండా కామ్ గా కూర్చున్నారు. మరి అంత సైలెంట్ ఎందుకు, అనుష్క ఘాటీ ఏప్రిల్ 18 రిలీజ్ అంటూ ప్రకటించారు. ఆ ఏప్రిల్ 18 వెళ్ళిపోయింది. సినిమా పోస్ట్ పోన్ అన్న విషయం చెప్పలేదు.
ఇక ప్రభాస్ రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదల అంటూ గొప్పగా ప్రకటించారు. అది కూడా పోస్ట్ పోన్ అయ్యింది, ఆ విషయాన్నీ అఫీషియల్ గా మేకర్స్ చెప్పలేదు, చెబితే కొత్త డేట్ ఇవ్వాల్సి వస్తుంది అనో, లేదంటే మారేదన్నా కారణమో కానీ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు.
సినిమా విడుదల వాయిదా అన్న విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అనేది అభిమానుల వాదన. మరి ఈ తీరు దర్శకులు, నిర్మాతలు మార్చుకుంటే బెటర్ అని ఫ్యాన్స్ కాస్త గట్టిగానే రిక్వెస్ట్ చేస్తున్నారు.