నిధి అగర్వాల్ కెరీర్ లో అంటే తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరొక హిట్ లేదు. మిగతా అన్ని జస్ట్ సో సో సినిమాలే. ఇప్పడు ఇద్దరు స్టార్ హీరోలను నమ్ముకుని నిధి అగర్వాల్ డైలమాలో పడింది. అందులో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు ప్రభాస్. పవన్, ప్రభాస్ ఇద్దరితో నటించే భాగ్యం నిధి అగర్వాల్ కు దక్కింది.
హరిహర వీరమల్లు, రాజా సాబ్ అదిగో, ఇదిగో రిలీజ్ అనడం, దగ్గరపడేసరికి పోస్ట్ పోన్ అవడం అన్ని నిధి అగర్వాల్ పాలిట శాపంగా మారాయి. ఆ రెండు సినిమాలు విడుదలైతే అమ్మడు కెరీర్ వెలిగిపోతుంది అని కలలు కంటుంటే అవి కాస్త వెనక్కి పోతున్నాయి.
తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అంటారేమో. అంత అందంగా నిధి అగర్వాల్ శారీ లుక్ ఉంది. అందులో ఆమె పడుకున్న భంగిమ చూస్తే నిధి అగర్వాల్ అందాలు మరింత హైలెట్ అయ్యాయి. టిష్యు శారీ లో చెవులకు జుంకీలు, చేతులకు గాజులు, ముక్కుకు ముక్కెరతో నిధి అగర్వాల్ గ్లామర్ గా కాదు బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆమె లుక్ చూసి నెటిజెన్స్ వావ్ నిధి అంటూ కామెంట్ చేస్తున్నారు.