పవన్ కళ్యాణ్ ఒప్పుకుని, సెట్స్ మీదున్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అని పవన్ ఫ్యాన్స్ కాదు పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ని గట్టిగా అడగలేని పరిస్థితి. అసలే డిప్యూటీ హోదాలో పవన్ ఉన్నారు. సో ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్. అలా అలా ఆయన ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ డిలే అవుతూ వస్తున్నాయి.
ప్రస్తుతం సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ ఫినిష్ చేసే అలోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే తన సినిమా నిర్మాతలతో పవన్ మీటింగ్ పెట్టడమే కాదు, ఆ మేరకు వారితో అన్ని రకాల విషయాలను మాట్లాడినట్లుగా తెలుస్తుంది. వెన్ను నొప్పితో విశ్రాంతిలో ఉన్న పవన్ తన నిర్మాతలకు మాట కూడా ఇచ్చారట.
వచ్చే నెల నుంచి వీరమల్లు, OG సెట్ లోకి వస్తాను అని, జులై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి చేస్తానని పవన్ మాటిచ్చినట్లుగా ప్రచారమైతే షురూ అయ్యింది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పాలనా విధమైన అంశాలతో పవన్ సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి అదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవడం ఖాయం.