ఒకప్పుడు సౌత్ లో కనిపించిన తాప్సి పన్ను కొన్నాళ్లగా సౌత్ సినిమాలకు బై బై చెప్పేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. అక్కడే ఉమన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటూ హైలెట్ అవుతున్న తాప్సి పన్ను మరో స్టార్ హీరోయిన్ కంగనా విషయంలో మాత్రం ఒంటి కాలిపై కయ్యానికి కాలుదువ్వుతోంది.
ఇక అక్కడి స్టార్స్ గురించి తాప్సి అప్పుడప్పుడు సన్సేషల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక బాలీవుడ్ లో అందాలు ఆరబోస్తున్న ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడంతో బ్యాట్మెంటన్ ప్లేయర్ ని ప్రేమ వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తుంది.
తాప్సి పన్ను సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. తరచూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యూత్ గుండె లయ తప్పేలా చేస్తుంది. తాజాగా తాప్సి శారీ లో దర్శనమిచ్చింది. శారీ లో గ్లామర్ ఏమంటుంది అనుకునేరు, ఆమె బ్లౌస్ తోనే అందాలను ఆరబోసిన తీరుకు నిజంగా మతిపోవల్సిందే అంటూ నెటిజెన్స్ తాప్సి న్యూ లుక్ పై కామెంట్లు పెడుతున్నారు.