జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత దేవర చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించారు. దేవర చిత్రం విడుదలకు ముందే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 హిందీ మూవీ ఓకె చేసారు. వార్ 2 తో బాలీవుడ్ కి ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ని ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేసేసారు.
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 ని ఒప్పుకుని తప్పు చేసారా అనే మాటలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఎన్టీఆర్ కి వార్ 2 హిందీలో బెస్ట్ డెబ్యూ అవ్వాలి, కానీ నిరాశపరచకూడదు. ఎన్టీఆర్ వార్ 2 లో సెకండ్ లీడ్ కేరెక్టర్ అంగీకరించకుండా ఉండాల్సింది అనేది అభిమానుల అభిప్రాయం, ఎందుకంటే వార్ 2లో మేజర్ స్క్రీన్ స్పేస్ హృతిక్ రోషన్ కి వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది అనేది అభిమానుల కంగారు.
కానీ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ అనిపించుకుని దేవరతో తన స్టార్ డమ్ నిలబెట్టుకుని వార్ 2 వైపు అడుగులు వేశారంటే ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎంతో ఆలోచించే ఉంటారు. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ లో స్పై థ్రిల్లర్స్ ఫ్రాంచైజీ అందరికి తెలిసిందే. టైగర్ గా సల్మాన్, పఠాన్ గా షారుఖ్, కబీర్ గా హృతిక్ కొనసాగుతున్న ఈ ఫాంటాస్టిక్ ఫ్రాంచైజీ లోకి వారికి ధీటుగా మరో స్పై ఏజెంట్ రోల్ లో బాలీవుడ్ ఎంట్రీకి బాగా థింగ్ చేసే స్టెప్ వేశారు ఎన్టీఆర్ అనేది సన్నిహితుల వాదన.
వార్ 2 లో స్పష్టంగా ఎన్టీఆర్ పాత్ర తాలూకు ఇంపాక్ట్ థియేటర్స్ ని షేక్ చేసే రేంజ్ లో, ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే స్థాయిలో ఉంటుందనేది మనకు తెలుస్తోన్న రిపోర్ట్. ఎన్టీఆర్ వార్ 2 ని ఎందుకు ఒప్పేసుకున్నారో అనేది అర్ధం కావడం లేదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో వేసిన ట్వీట్లు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. ఆన్సర్ అందరికి వస్తుంది ఆగష్టు 14 న, రిజల్ట్ అందరికి తెలుస్తుంది వార్ 2 రిలీజ్ రోజున.