దర్శకుడు సుకుమార్ పుష్ప 2 భారీ విజయం తర్వాత ఇప్పటివరకు కూల్ గా రిలాక్స్ అవుతున్నారు. పుష్ప ద రూల్ తర్వాత సుకుమార్ ప్లాన్ ఏమిటి, రామ్ చరణ్ తో అనౌన్స్ చేసిన సినిమాపై చరణ్ బర్త్ డే కి ఎలాంటి అప్ డేట్ లేకపోయేసరికి అందరూ సుకుమార్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. పెద్ది వచ్చే ఏడాది మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే కి విడుదల చేస్తున్నట్టుగా చెప్పేసారు, ఇక సుక్కు ప్రాజెక్ట్ మొదలు కావాలంటే రామ్ చరణ్ పెద్ది తర్వాత మరో మూవీ చేశాకే ఫ్రీ అవుతారని తెలుస్తుంది.
మరి ఇప్పుడు సుక్కు ప్లాన్ ఏమిటి, ఆయన ఏ హీరో తో మూవీ చేస్తారు, మళ్ళి పాన్ ఇండియా ఫిలిం చేస్తారా, దాని కోసం ఏ హీరోని చూజ్ చేసుకుంటారు అంటూ సుకుమార్ అభిమానుల్లో ఆత్రుత మొదలైంది.