వేసవి తాపానికి తాళలేక చాలా మంది కథానాయికలు ఒంటరి దీవుల్లో సేద దీరుతున్నారు. పలువురు టాలీవుడ్ స్టార్లు శీతల దేశాలకు వెకేషన్ కోసం వలస వెళుతున్నారు. అయితే ఈ టాలీవుడ్ టాప్ హీరో మాత్రం ఇటలీలో రిజనవేట్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇటలీలో మైనస్ డిగ్రీల చలిలో అతడు ప్రస్తుతం సేద దీరుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో హైదరాబాద్ లో వేసవి మంటను తట్టుకోలేని పరిస్థితి ఉంది. అందుకే నేరుగా ఇటలీలోని తన సొంత ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నాడని గుసగుస వినిపిస్తోంది.
స్వతహాగా తీరిక సమయాల్లో సరదాగా గడిపే మైండ్ సెట్ అతడిది. టైమ్ దొరికితే స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం ఈ స్టార్ అలవాటు. హైదరాబాద్ ఔటర్ లో తన ఫామ హౌస్ లో పార్టీలతో వీలున్నప్పుడల్లా సరదాగా కాలక్షేపాన్ని ఇష్టపడతాడు. కానీ ఇటీవలి కాలంలో విదేశాల్లో చిల్ అయ్యేందుకే అతడు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాడని గుసగుస వినిపిస్తోంది.
ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు నిరంతరం ప్రయాణిస్తున్నాడు. దానికోసం ఇటలీ కేంద్రంగా ఒక ఫామ్ హౌస్ కొనుగోలు కోసం భారీగా పెట్టుబడి పెట్టాడని కూడా ఇదివరకూ కథనాలొచ్చాయి. ఏది ఏమైనా అతడు బాగా రిలాక్స్ అయ్యి తన ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇవ్వడమే చాలా ముఖ్యం. స్టార్ హీరో రీఛార్జ్ అవుతూ ప్రజల్ని కూడా రీఛార్జ్ చేయడానికి త్వరగా సినిమాల్ని రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.