కరోనా చాలా మంది గుండెల్లో కల్లోలం నింపింది. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, వ్యాపారం లేస్తుందో పడుతుందో, ఊగిసలాడే కెరీర్ ఏమవుతుందో అనే ఆందోళనలోనే యూత్ అంతా గడిపారు. అలాంటి వారిలో ఉప్పెన బుచ్చిబాబు సనా కూడా ఒకడు. అతడు తన తొలి సినిమా `ఉప్పెన` సజావుగా విడుదలవుతుందా లేదా? అని ఆందోళన చెందాడు. తీవ్ర గందరగోళంలో పడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
బుచ్చిబాబు మాట్లాడుతూ-``నా తొలి చిత్రం `ఉప్పెన` వెండితెరపై వెలుగు చూస్తుందో లేదోనని ఆందోళన చెందాను. థియేటర్లు మూతపడ్డాయి. అన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు వెళుతున్నాయి. నా తొలి చిత్రం థియేటర్లలో విడుదల కాకపోతే OTTలో మాత్రమే విడుదలైతే నేను తరువాత పరిశ్రమలో నిలబడగలనా లేదా అని నేను భయపడ్డాను`` అని తెలిపాడు.
కానీ గందరగోళంలోనే సానుకూలత వెతికాడు! కరోనా క్రైసిస్ సమయంలో తీరిక సమయాన్ని ఉపయోగించుకుని, బుచ్చిబాబు కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా పెద్ది కథను రాశాడు. కథ రాసిన తర్వాత దానిని సుకుమార్‌కు వివరించాడు. అతనికి స్క్రిప్ట్ నచ్చింది. బుచ్చిబాబును ఆశ్చర్యానికి గురి చేసేలా రామ్ చరణ్‌కు కథ చెప్పమని సుకుమార్ పంపించాడు. చరణ్ సర్ స్క్రిప్ట్ విన్నప్పుడు, ఆయన పాత్ర చిత్రణ, కథాంశానికి వెంటనే ఆకర్షితుడయ్యారు. కథ విన్నంత సేపూ చరణ్ వైబ్‌ను అనుభవించగలిగారు. కథ ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సిట్టింగ్‌లోనే చిన్న చిన్న సవరణలతో స్క్రిప్ట్‌ను ఓకే చేశారు. మిగిలినదంతా తెలిసినదే కదా? అని బుచ్చిబాబు చెప్పాడు.