బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ను ప్రేమించి 2021 లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆతర్వాత ఈ జంటకు ఓ బాబు పుట్టాడు. తాజాగా గుత్తా జ్వాల-విష్ణు విశాల్ మరోసారి శుభ వార్త చెప్పారు. అది కూడా వారి పెళ్లి రోజునాడే గుత్తా జ్వాల పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడం నిజంగా విశేషమే అని చెప్పాలి.
గుత్తా జ్వాల-విష్ణు విశాల్ జోడి నేడు నాలుగో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. అదే రోజు అంటే ఏప్రిల్ 22 మంగళవారం గుత్తా జ్వాల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చినట్టుగా విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకోవడమే కాదు, ఆర్యన్ అన్నయ్య అయ్యాడు, మా పెళ్లి రోజున పాప పుట్టటం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేసారు.
దానితో విష్ణు విశాల్-గుత్తా జ్వాల జంటకు స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలపడమే కాదు, పెళ్లి రోజునే తల్లవడం విశేషమెగా అంటూ జ్వాలా గుత్తా ను స్పెషల్ గా విష్ చేస్తున్నారు.