తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన నటుడిపై మలయాళ నటి విన్సీ ఫిలింఛాంబర్, అంతర్గత క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో నటుడు షైన్ టామ్ చాకో పేరు డ్రగ్స్ లో ప్రధానంగా వినిపించింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతడు డ్రగ్స్ తీసుకున్నానని అంగీకరించడమే గాక, చాలా మంది పెద్ద స్టార్లు ఇందులో ఉన్నారని అన్నాడు.
ఇదిలా ఉండగానే నటి విన్సీ తాను షైన్ టామ్ చాకోపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోనని తాజాగా మీడియాకు వెల్లడించింది. అతడిని పరిశ్రమ అంతర్గతంగా విచారించాలని తాను కోరుకుని ఫిలింఛాంబర్ ఇతర కమిటీలకు ఫిర్యాదు చేసానని అతడి పేరును కూడా తాను బయటపెట్టలేదని, కానీ వారంతా నమ్మక ద్రోహం చేసారని, అతడి పేరును లీక్ చేసారని విన్సీ సినీపెద్దలపైనే ఆరోపించింది. అలాగే తనకు షైన్ పై పోలీస్ కేసు పెట్టే ఆలోచన లేదని వెల్లడించింది. లైంగిక వేధింపుల కేసుల్లో చాలా మంది స్టార్లు, దర్శకనిర్మాతలపై విచారణలు సాగాయి. గడిచిన నాలుగేళ్లలో అన్ని సినీపరిశ్రమల్లో ప్రముఖుల పేర్లు వినిపించాయి.
కానీ లీగల్ గా ఏదీ ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు విన్సీ తన సహనటుడిపై లీగల్ కేసు పెట్టనని తెలివిగా మాట్లాడుతుండడం చర్చగా మారింది. విన్సీ అతడిపై ఎలాంటి కేసులు ఫైల్ చేయకపోయినా, పోలీసులు, ఎన్.సి.బి అధికారులు టామ్ చాకోని విచారిస్తున్న సంగతి తెలిసిందే.