రామ్ చరణ్ - బుచ్చి బాబు కలయికలో క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంపై అభిమానుల్లోనే కాదు మాస్ ఆడియన్స్ లోను హైప్ పెరిగేలా చేసింది పెద్ది గ్లింప్స్. రామ్ చరణ్ మాస్ లుక్ పై విమర్శలొచ్చినా, పెద్ది గ్లింప్స్ మాత్రం ఆ విమర్శలకు చెక్ పెట్టింది.
పెద్ది గింప్స్ లో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ కింద గట్టిగా కొట్టి బాల్ ని సిక్సర్ కి పంపించిన షాట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ షాట్ మాస్ ఆడియన్స్ ను ఊపేసింది. తాజాగా దర్శకుడు బుచ్చి బాబు పెద్ది చిత్రంలో క్రికెట్ షాట్ పై ప్రశంశలు దక్కాల్సింది.. తనకి కాదు అది డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్ నవకాంత్ కి ఆ క్రెడిట్ ఇవ్వాలంటూ బుచ్చిబాబు చెప్పారు. ఆ షాట్ అంతలా ట్రెండ్ అవడం తనకు హ్యాపీగా అనిపించింది అన్నారు.
ఇక పెద్ది గ్లింప్స్ రిలీజ్ రోజున నేను రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాము, ఆ గ్లింప్స్ చిరంజీవి గారికి నచ్చుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాను, కానీ పెద్ది గ్లింప్స్ చూసాక బావుంది అన్నారు, అది ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకం అంటూ బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఆయన రెండు రోజుల షూటింగ్ చేసినందుకే పెద్దిపై నెక్స్ట్ లెవల్ అంచనాలు పెంచేలా ఓ ఈవెంట్ లో మట్లాడడం ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగేలా చేసింది.
ఇక పెద్ది చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27 న విడుదలకు సిద్ధం చేస్తున్నట్టుగా పెద్ది గ్లింప్స్ లోనే రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసారు మేకర్స్.