నిజమే పదే పదే సినిమా రిలీజ్ వాయిదా పడుతుంటే నిర్మాతలు దివాళా తియ్యక ఏం చేస్తారు. ఇప్పుడు పవన్ ప్రొడ్యూసర్స్ పరిస్థితి అలానే కనిపిస్తుంది. రాజకీయాల్లో బిజీగా వుంటున్నప్పటికి సినిమాలు చేస్తేనే డబ్బు వస్తుంది అని పవన్ కళ్యాణ్ గబగబా సినిమాలు ఒప్పేసుకుని రంగంలోకి దిగారు. ఆతర్వాత ఎన్నికల్లో గెలవడం, డిప్యూటీ సీఎం అవడం అన్ని చకచకా జరిగినా పవన్ తమ సినిమాలు ఎపుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి.
ఎప్పుడో ఏ ఏం రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకుడిగా హరి హర వీరమల్లు మొదలు పెట్టారు. ఆ షూటింగ్ వాయిదాలతో క్రిష్ దర్శకత్వం నుంచి తప్పుకున్నారు, ఆతర్వాత రెండుమూడు డేట్స్ మారాయి. ఇప్పుడు ఫైనల్ గా మే 9 నుంచి కూడా హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ తథ్యం. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో చేసేది లేక మేకర్స్ మళ్లీ పోస్ట్ పోన్ చెయ్యాలని చూస్తున్నారు.
ఇక సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా మొదలైన OG ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. మరి ఈ లెక్కన నిర్మాతలు దివాళా తియ్యక ఏమవుతుంది, ఇదే నెటిజెన్స్ పవన్ సినిమాల నిర్మాతల గురించి నెటిజెన్స్ మాట్లాడుకుంటున్న మాటలు.