సమ్మర్ హాలిడేస్ ముమ్మరంగా మొదలయ్యాయి. పిల్లలకు ఈ నెల 20 నుంచే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. కానీ థియేటర్స్ లో భారీ బడ్జెట్ సినిమాలేవీ లేక ఆడియన్స్ ఉసూరుమంటున్నారు. పిల్లలతో కలిసి వేసవిలో సరదాగా సినిమాకి వెళ్దాం అంటే అదిరిపోయే బొమ్మ కానరావడం లేదు, గత వారం విడుదలైన తమన్నా ఓదెల 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ప్రేక్షకులకు కాస్తంత ఊరట కలిగించాయి.
ఇక ఏప్రిల్ చివరి వారంలో పలు చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో ప్రియదర్శి సారంగపాణి జాతకం, చౌర్య పాఠం, సోదర, డబ్బింగ్ చిత్రం జింఖానా వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు
జియో హాట్‌స్టార్ :
ది రిహార్సల్స్ (ఇంగ్లీష్) సీజన్-1 ఏప్రిల్ 21
స్టార్‌వార్స్: యాండిర్ (ఇంగ్లీష్) సీజన్1 ఏప్రిల్ 23
ఎల్2: ఎంపురాన్ (తెలుగు) ఏప్రిల్ 24
నెట్ ఫ్లిక్స్ :
మ్యాడ్ స్క్వేర్(తెలుగు) ఏప్రిల్ 25
బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 23
ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్ ఫ్లైట్ 3054 (ఇంగ్లీష్) ఏప్రిల్ 23
యు: ది కిల్లర్ ఫైనల్ (మూవీ) ఏప్రిల్ 24
వీక్ హీరో (ఇంగ్లీష్) ఏప్రిల్ 25
డిటెక్టివ్ కోనాన్ (యానిమేషన్) ఏప్రిల్ 25
హ్యావోక్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 25
జ్యువెల్‌థీఫ్: ది హెయిస్ట్ బిగెన్స్ (హిందీ) ఏప్రిల్ 25
అమెజాన్ ప్రైమ్ వీడియో:
వీర ధీర శూర (తెలుగు) ఏప్రిల్ 24
జీ5 :
అయ్యన మానే (మూవీ) ఏప్రిల్ 25
సోనీలివ్ :
షిర్డీ వాలే సాయిబాబా (మూవీ) ఏప్రిల్ 21