లిక్కర్ స్కామ్ లో సొర చేప మాదిరి సిట్ అధికారుల నోటీసులను పెడ చెవిన పెట్టి తనని దోషిగా మార్చిన విజయ్ సాయి రెడ్డి వాంగ్మూలం రాజ్ కసిరెడ్డి ని ఇరుకున పడేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి చెప్పట్టలేదు, రాజకీయాలకు సంబంధం లేని పేరు రాజ్ కసిరెడ్డి ది. జగన్ తో అనుబంధం, వైవి సుబ్బారెడ్డితో సంబంధంతో జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ చేసిన రాజ్ కసిరెడ్డి విచారణ నుంచి తప్పించుకోవడంతో అతని తండ్రిని సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు.
దానితో రాజ్ కసిరెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయింగా, ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేలా లేకపోవడంతో రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరు కావాలని భావించి రేపు ఉదయం సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని అధికారులకు సమాచారం అందించాడు.
అయితే అరెస్ట్ భయంతో కొన్నాళ్లుగా దుబాయ్ లో ఉంటున్న రాజ్ కసిరెడ్డి ఈరోజు సాయంత్రం దుబాయ్ నుంచిహైదరాబాద్ కి బయలుదేరాడు. అది కూడా మారు పేరు అంటే రాజేష్ రెడ్డి అనే పేరుతో దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ కి సీక్రెట్ గా చేరుకునే క్రమంలో ఆయనపై నిఘా ఉంచిన సిట్ అధికారులు రాజ్ కాసిరెడ్డిని వల వేసి అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర కాపు కాసి అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. రేపు ఉదయం రాజ్ కసిరెడ్డి విచారణ జరగనుంది.