బాలీవుడ్ లో క్రేజీగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న రశ్మికకు మురుగదాస్-సల్మాన్ ఖాన్ ల సికందర్ స్పీడు బ్రేకర్స్ వేసింది. సికందర్ చిత్రం డిజాస్టర్ అవడమే కాదు, అందులో రష్మిక కేరెక్టర్ పైన కూడా విమర్శలొచ్చాయి. వరసగా బ్లాక్ బస్టర్స్ తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన రశ్మికకు సికందర్ కోలుకోలేని షాకిచ్చింది.
అంతేకాకుండా అటు విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తున్నప్పటికీ రష్మిక సీక్రెట్ ని మైంటైన్ చేస్తుంది అనే ప్రచారం ఉంది. అదలాఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రష్మిక తాజాగా తన ఇన్స్టా లో వదిలిన పిక్స్ మాత్రం బ్యూటిఫుల్ అనేలా ఉన్నాయి.
రెడ్ రోజ్ ని ముద్దాడుతూ.. తన జడ కొప్పులో మాత్రం వైట్ రోజ్ పెట్టుకుని క్యూట్ గా కాదు కాదు, బ్యూటిఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం రష్మిక రెండుమూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది, గర్ల్ ఫ్రెండ్, కుబేర లాంటి చిత్రలతో త్వరలోనే రష్మిక ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.