సమంత ఏం చేయబోతుంది, సడన్ ట్విస్ట్ ఇవ్వదు కదా, సమంత ఎందుకింత సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది.. ఇప్పుడు సమంత అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. కారణం సమంత రెండో పెళ్లిపై రకరకాల ప్రచారాలు ఆమె అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నాగ ఛైతన్య తో విడాకుల తర్వాత ఒంటరి పోరాటం చేస్తున్న సమంత ఇప్పుడు రెండో పెళ్ళికి సిద్దమైందా? అనేదే ఎవ్వరికి అర్ధమవడం లేదు.
ప్రముఖ దర్శకుడు రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ చేస్తుందా, అందరూ అనుకున్నట్టుగా ఆమెకి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరగలేదు కదా, అందుకే తిరుపతిలో అలాగే శ్రీకాళహస్తిలో సమంత రాజ్ తో కలిసి పూజలు చేయించిలేదు కదా.. అమ్మో ఇన్ని అనుమానాలు సోషల్ మీడియాలో మొదలైనాయి.
సమంత రీసెంట్ గా తిరుమల వెళ్లి రాజ్ నిడమోరు, శుభం టీమ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకోవడమే కాదు, ఆమె రాజ్ నిడమోరు తో కలిసి శ్రీకాళహస్తిలో స్పెషల్ పూజ చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది చూసే సమంత ఏం ట్విస్ట్ ఇవ్వదు కదా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.