యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం డ్రాగన్ లోకి ఎంటర్ అయ్యేందుకు సమయం దగ్గర పడింది. ఈనెల 22 న అంటే మంగళవారం నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. రీసెంట్ గానే దుబాయ్ లో ఫ్యామిలీ వెకేషన్ ని కంప్లీట్ చేసుకుని ఎన్టీఆర్ పూర్తిగా డ్రాగన్ కోసం సిద్ధమవుతున్నారు.
ఈరోజు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి లతో కలిసి మంగళూరుకు పయనమయ్యారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కర్ణాటక దగ్గరలోని ఓ లొకేషన్ లో ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టడమే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించే ప్లాన్ చేసారు నీల్. ఇప్పటికే భారీ విస్ఫోటనంతో ఎన్టీఆర్ సెట్ లోకి రాబోతున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. దాని కోసమే ఎన్టీఆర్ మంగుళూరు వెళ్లారు.
ఎన్టీఆర్.. నీల్ సినిమాలో తలడబోయే విలన్ పై అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరయిన్ గా ఫైనల్ అంటున్నారు, ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.