హీరోయిన్ త్రిష 40 ప్లస్ లోను పెళ్లి చేసుకోకుండా కెరీర్ పైనే ఫోకస్ పెడుతుంది. గతంలో వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి నిశ్చయమవడమే కాదు ఆమె ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దానిని బ్రేక్ చేసుకుని కెరీర్ లో స్పీడప్ అయిన త్రిష కొన్నాళ్లుగా హీరో విజయ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో త్రిష రియాక్ట్ అవ్వలేదు.
కానీ పెళ్లి పై తాజాగా త్రిష చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. థగ్ లైఫ్ ప్రెస్ మీట్ తర్వాత త్రిష పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చింది. పెళ్లపై తనకు సదభిప్రాయం లేదంది. అసలు పెళ్లిపై నమ్మకం లేదంది, తనకి పెళ్లి అయినా ఓకె, కాకపోయినా ఓకె అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఇక నా పెళ్లి పై ఏవేవో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ అవాస్తవాలు. మీరు పెళ్లేందుకు చేసుకొలేదు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అసలు పెళ్లెప్పుడు చేసుకుంటానో అనేది చెప్పలేను, నా మనసుకు నచ్చిన వ్యక్తి, నన్ను లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకునేవాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాజీపడి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు.
పెళ్లి చేసుకుని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు, అలాంటి పరిస్థితి నాకు ఎదురవ్వకూడదనే పెళ్లి విషయంలో తొందర పడడం లేదు అంటూ త్రిష పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.