తన పెళ్లయిన కుమార్తెను అత్యాచారం చేస్తామంటూ పలువురు దుండగులు సోషల్ మీడియాల్లో చెలరేగిపోవడంతో పాపులర్ దర్శకుడు ఖంగు తిన్నాడు. తనను తన కుమార్తెను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన కొందరు సోషల్ మీడియాల్లో తీవ్రంగా తిట్లతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా అతడి ఇంట్లో మహిళలను వారంతా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాల్లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. దీంతో బెంబేలెత్తిన సదరు దర్శకుడు మహిళలను ఇందులోకి లాగొద్దని వేడుకున్నాడు. తన కుటుంబాన్ని, మహిళలను టార్గెట్ చేయవద్దని మొరపెట్టుకున్నాడు.
అయితే సదరు దర్శకుడిని, అతడి కుటుంబాన్ని, గారాల కుమార్తెను ఇందులోకి లాగడానికి కారణం అతడు బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించడమే. వారిపై మూత్రం పోస్తానంటూ అతడు అనుచితంగా కామెంట్ చేయడంతో సదరు కులస్తులు దీనిని తీవ్ర అవమానంగా భావించారు. వెంటనే సోషల్ మీడియాల్లో అతడిని ఎటాక్ చేసారు. అదే సమయంలో దర్శకుడి కుమార్తెపై అత్యాచారం చేస్తామని కొందరు కామెంట్ చేయడంతో అతడు మనోవేదనకు గురయ్యాడు.
ఇలా తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆ దర్శకుడు మరెవరో కాదు.. అనురాగ్ కశ్యప్. అతడి కుమార్తె ఆలయా కశ్యప్ ఇటీవల తన విదేశీ ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. మ్యారీడ్ డాటర్ పై నెటిజనులు అనుచిత కామెంట్లు చేయడంతో చలించిపోయిన అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ సమాజంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు.