హీరో అజిత్ మరో ప్రమాదానికి గురయ్యారు. అజిత్ కార్ రేసింగ్ లో తరచూ ప్రమాదాలకు గురవ్వడం, తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఈమధ్య కాలంలో సర్వసాధారణంగా మారింది. రీసెంట్ గా దుబాయ్ కార్ రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇప్పుడు అజిత్‌కు మరోసారి తప్పిన కారు ప్రమాదం, బెల్జియంలో కారు రేసులో పాల్గొన్న అజిత్ రేస్ కారు ప్రమాదానికి గురయ్యింది, రేస్ లో భాగంగా ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లిన అజిత్ కారు, ఎప్పటిలాగే అజిత్ ఈసారి కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడం ఆయన అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది.
అజిత్ రీసెంట్ గానే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అటు సినిమా విడుదల కాగానే ఇటు అజిత్ బెల్జియం కార్ రేసింగ్ కి వెళ్లిపోయారు, అక్కడ ఇలా ప్రమాదం జరిగి అందులోనుంచి బయటపడ్డారు.