దర్శకధీరుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ అయినా, పోస్ట్ ప్రొడక్షన్ అయినా, షూటింగ్ అయినా, లేదంటే సినిమా ప్రమోషన్స్ అయినా దేనికి తొందర పడరు. చాలా కూల్ గా అన్ని ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతారు. మహేష్ SSRMB మొదలు పెట్టడానికే రాజమౌళి చాలా సమయాన్ని తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులకే రాజమౌళి అంత టైమ్ తీసుకుంటే సినిమా విడుదలకు ఏ రెండు మూడేళ్లో పడుతుంది అని మహేష్ అభిమానులు ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు రాజమౌళి స్పీడు చూస్తుంటే అందులో నటిస్తున్న మహేష్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా అందరూ ఆయన స్పీడు అందుకోవాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న SSMB 29 ఇప్పుడు మూడో షెడ్యూల్ కి ఎంటర్ అయ్యింది. మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా విదేశీ ట్రిప్స్ నుంచి తిరిగి రావడమే రాజమౌళి మూడో షెడ్యూల్ షురూ చేసారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
మహేష్ ఆల్రెడీ ఇటలీ నుంచి వచ్చేసారు. రాజమౌళి జపాన్ ట్రిప్ నుంచి వచ్చారు. తాజాగా ప్రియాంక చోప్రా ముంబై నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. సో ఈరోజు నుంచే SSMB 29 మూడో షెడ్యూల్ మొదలైంది. మరి గతంలో ఆచితూచి షూటింగ్ చేసే రాజమౌళి మహేష్ చిత్రాన్ని మాత్రం చాలా స్పీడుగా పూర్తి చేస్తున్నారు అంటూ మహేష్ అభిమానులు సంబరపడుతున్నారు.