కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొన్నాళ్లుగా వరస ప్లాప్ లతో తన ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నారు. అజిత్ సినిమాలు కోలీవుడ్ లో తప్ప మిగతా ఏ భాషల్లోనూ హిట్ అవవడమే లేదు. అజిత్ తెలుగు మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్. రీసెంట్ గా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా కోలీవుడ్ లో హిట్ అయ్యింది. కానీ మిగతా లాంగ్వేజెస్ లో మాత్రం నిరాశపరిచింది.
కోలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మిక్స్డ్ టాక్ తో మొదలై ఇప్పుడు 200 కోట్ల మార్క్ ని టచ్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని తెలుగు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇప్పుడు వాళ్లకు కోలీవుడ్లో ఆ చిత్రంతో లాభాలు రావడం సంతోషించదగిన విషయమే.
మిక్స్డ్ టాక్ తో 200 కోట్లు కొల్లగొట్టడం అనేది అజిత్ కే సాధ్యమైంది అంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. అదే అజిత్ బ్లాక్ బస్టర్ తీస్తే గనక ఆ కలెక్షన్స్ అందుకోవడం ఏ హీరోకు సాధ్యమవ్వదు అంటూ వారు ఛాలెంజ్ చేస్తున్నారు.