సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ కాస్ట్లీ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన అలేఖ్య చిట్టి అక్క చెల్లెళ్లకు కష్టమర్లు చుక్కలు చూపించారు. అలేఖ్య అక్క చెల్లెల్లు పచ్చళ్ళ ధర ఎంత ఎక్కువైనా పెద్దగా పట్టించుకోని కస్టమర్లు.. అలేఖ్య కస్టమర్ ని బండబూతులు తిట్టిన వీడియో, ఆడియో వైరల్ అవడంతో కస్టమర్లే కాదు తోటి ఇన్ఫ్లుయన్సర్స్ అలేఖ్య చిట్టి అక్క చెల్లెళ్లకు చుక్కలు చూపిస్తున్నారు.
బూతులు తిట్టి సారీ చెబితే సరిపోతుంది అనుకున్న అక్క చెల్లళ్ళు నెటిజెన్స్ ట్రోలింగ్ తో పచ్చళ్ళ వ్యాపారం మూసుకుని చివరికి అలేఖ్య ఆసుపత్రి పాలైంది. దానితో దారికొచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ అక్క చెల్లెళ్లలో సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన రమ్య తాజాగా ఓ వీడియో వదిలింది. ఆ వీడియోలో రమ్య మాట్లాడుతూ అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని కేవలం 11 నెలల్లోనే మూసివేయాల్సి వస్తుందని ఊహించలేదు. అవును ఇకపై అలేఖ్య చిట్టి పికిల్స్ ఉండదు.
కానీ మేము త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నాము, ఈ వ్యాపారంలో మా అక్క అలేఖ్య ఉండదు. నేను- నా చెల్లి మాత్రమే ఉంటాము. గతంలో ఉన్న అధిక ధరలు కాకుండా, సామాన్యులు కూడా కొనుగోలు చేయగలిగే ధరలతో రమ్య మోక్ష పికిల్స్ తో మీ ముందుకు వస్తాము.
మా వ్యాపారం బిల్డ్ అవ్వాలంటే కాస్త సమయం పడుతుంది, కనీసం రెండు నెలలు సమయం పట్టవచ్చు. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మా వ్యాపారానికి పూర్వ వైభవం వస్తుందో లేదో మాకు తెలియదు.. కానీ మమ్మల్ని ఇష్టపడేవారు మాకు సలహాలిస్తున్నారు, బిజినెస్ మొదలు పెట్టమని అంటూ రమ్య ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
మరి అలెక్ష్య చిట్టి పిల్స్ అధిక ధరలు తీసేసి రమ్య మోక్ష పికిల్స్ తక్కువ ధరలకే అమ్ముతామని చెప్పడం చూసి అందరూ దెబ్బకి దారికొచ్చారు అక్క చెల్లెళ్ళు అంటూ కామెంట్లు పెడుతున్నారు.