Advertisementt

జగన్ పై చాలా అసంతృప్తి ఉందిగా..

Sat 19th Apr 2025 10:01 AM
vijayasai reddy  జగన్ పై చాలా అసంతృప్తి ఉందిగా..
Vijaya Sai reddy Sensational comments on Jagan జగన్ పై చాలా అసంతృప్తి ఉందిగా..
Advertisement
Ads by CJ

విజయ్ సాయి రెడ్డి పార్టీకి రాజీనామా చెయ్యడం నిజంగా వైసీపీ నేతలకేమో కానీ.. సామాన్య ప్రజలకు మాత్రం బిగ్ షాకిచ్చింది. జగన్ తర్వాత వైసీపీ పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయ్ సాయి రెడ్డి పార్టీకి రాజీనామా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తే.. అందరూ ఎక్కడ జగన్ వైపు వేలు చూపిస్తారో అని భయపడి బ్లూ మీడియా విజయ్ సాయి రెడ్డి బీజేపీలోకి  వెళుతున్నారు, కేసులు లేకుండా ఉండేందుకు విజయ్ సాయి రెడ్డి పార్టీ మార్చేసారు అని ప్రచారం చేసింది. 

పార్టీకి రాజకీయాలకు రాజీనామా చేసి మొదట్లో సైలెంట్ గా తన పని తాను చూసుకుంటున్న విజయ్ సాయి రెడ్డి ని వైసీపీ నేతలు కెలకడం, సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే విజయ్ సాయి రెడ్డి ప్రలోభాలకు లొంగి పార్టీని వదిలిపోయారంటూ కామెంట్ చెయ్యడంతో విజయ్ సాయి రెడ్డి బరస్ట్ అయ్యారు. తనని వైసీపీ పార్టీలో అవమానించారు, నేను పడిన అవమానాలు ఎవ్వరూ పడలేదు, కనీసం జగన్ దగ్గరకు వెళ్లకుండా ఆయన చుట్టూ ఉన్న కోటరీ గోడ కట్టింది, మా అధినాయకుడు కళ్ళకు గంతలు కట్టారు, జగన్ మనసులో నేను లేను, నేనేమి ప్రలోభాలకు లొంగిపోలేదు అంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు. 

ఆ తర్వాత లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మరోసారి విజయ్ సాయి రెడ్డి జగన్ పై, వైసీపీ పార్టీ పై చేసిన కామెంట్స్ చూసాక జగన్ పై విజయ్ సాయి రెడ్డిలో చాలా అసంతృప్తి ఉంది అంటారేమో. నేను వైసీపీ పార్టీలో రెండవ స్థానం నుంచి రెండు వేలో స్థానానికి పడిపోయాను, జగన్ చుట్టూ చేరిన కోటరీ నన్ను చాలా అవమానించింది, గతంలో నేను చెప్పిన కోటరీ అప్పట్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత, మా నాయకుడి దగ్గరకు వెళ్లి  సాయి రెడ్డి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడు, మీకు స్థానభ్రంశం చేస్తాడు అని నాపై నిందలు మోపి, పార్టీ లో రెండవ స్థానంలో ఉన్న నన్ను 2000వ స్థానానికి తీసుకొచ్చారు.

ఈ కోటరీ వేదింపులు తాళలేక, నాయకుడి మనసులో నాకు స్థానం లేదని తెలుసుకొని, నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను.. అంటూ నిన్న లిక్కర్ స్కామ్ విచారణ తర్వాత విజయ్ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 

Vijaya Sai reddy Sensational comments on Jagan:

Vijayasai Reddy Emotional Comments on Jagan

Tags:   VIJAYASAI REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ