తండేల్ చిత్రం సక్సెస్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు తో #NC24 అనౌన్స్ చేసాడు. నాగ చైతన్య త్వరలోనే కార్తీక్ దండుతో కలిసి #NC24 సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన శ్రీలీల నటిస్తుంది అనే ప్రచారం జరిగింది.
అంతేకాదు లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించింది. కానీ ఆ తర్వాత శ్రీలీల అఖిల్, నాగ చైతన్య లతో అంటే అక్కినేని అన్నదమ్ముల్లతో రొమాన్స్ చేస్తుంది అన్నారు. తాజాగా నాగ చైతన్య కు జోడిగా మీనాక్షి చౌదరినే NC 24 చిత్రంలో చైతు తో కలిసి జంటగా కనిపిస్తుంది అంటున్నారు.
మరి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకిమామ తో రొమాన్స్ చేసిన మీనాక్షి ఇప్పుడు #NC24 లో అల్లుడు నాగ చైతన్య తో రొమాన్స్ చేస్తుంది అని సమాచారం.. అదే నిజమైతే మామ-అల్లుళ్లతో మీనాక్షి చౌదరి బ్యాక్ టు బ్యాక్ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లే.