అవును యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజమే చెప్పారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చివరి 20 నిమిషాలు అదిరిపోతోంది, అందరిని కంట తడి పెట్టిస్తుంది, సినిమాని నేను చూసాను అంటూ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలే నిజమయ్యాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి ఆ చివరి 20 నిమిషాలు అలాగే క్లైమాక్స్ అద్భుతం అంటూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వీక్షించినవారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతున్నారు.
ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదలైన కళ్యాణ్ రామ్-విజయశాంతిల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి పబ్లిక్ రెస్పాన్స్ ఇలా ఉంది. సినిమాలో యాక్షన్ అలాగే తండ్రి కొడుకుల మధ్యన నడిచే ఎమోషనల్ డ్రామా, క్లైమాక్స్, కళ్యాణ్ రామ్, విజయశాంతి పెరఫార్మెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయని చెబుతున్నారు.
ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి క్లైమాక్స్ ఆయువు పట్టు అంటున్నారు. కాకపోతే కథ, కథనం అవుట్ డేటెడ్ కావడంతో సినిమాకి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. కానీ నందమూరి అభిమానులు మాత్రం మాస్ కి నచ్చే యాక్షన్, క్లాస్ కి నచ్చే ఎమోషన్స్ సినిమాలో కావాల్సినన్ని ఉన్నాయంటూ మాట్లాడుకుంటున్నారు.
చూద్దాం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి ఈ వేసవి సెలవలు ఏ మాత్రం హెల్ప్ అవుతాయి అనేది.