Advertisementt

నెలలోపే విక్రమ్ సినిమా ఓటీటీలోకి

Fri 18th Apr 2025 01:24 PM
veera dheera sooran  నెలలోపే విక్రమ్ సినిమా ఓటీటీలోకి
Veera Dheera Sooran: Part 2 gets OTT release date నెలలోపే విక్రమ్ సినిమా ఓటీటీలోకి
Advertisement
Ads by CJ

తంగలాన్ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ నటించిన మరో మూవీ వీర ధీర శూర పార్ట్ 2. వీర ధీర శూర పార్ట్ 1 కన్నా ముందే వీర ధీర శూర పార్ట్ 2 ని రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్య చకితులను చేసిన విక్రమ్ అండ్ టీమ్ వీర ధీర శూర పార్ట్ 2 తో డీసెంట్ హిట్ అందుకున్నారనే చెప్పాలి. కాకపోతే ప్రోపర్ ప్రమోషన్స్ లేకపోవడం, అలాగే విడుదల రోజు సమస్యలు చుట్టు ముట్టడం అన్ని వీర ధీర శూర పార్ట్ 2 కి ఎఫెక్ట్ అయ్యాయనే చెప్పాలి. 

ఇక థియేటర్స్ లో వీర ధీర శూర పార్ట్ 2 ఫైనల్ రన్ ముగియడంతో.. ఇప్పడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. వీర ధీర శూర పార్ట్ 2 ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్నారు.  

ఇప్పుడు వీర ధీర శూర పార్ట్ 2 థియేటర్స్ లో విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుంది అమెజాన్ ప్రైమ్. ఈ చిత్రం ఈ నెల అంటే  ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. 

Veera Dheera Sooran: Part 2 gets OTT release date:

Chiyaan Vikram Veera Dheera Sooran Part 2  OTT release date out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ