తెలుగులో స్పెషల్ సాంగ్స్ తో ఫేమస్ అయ్యి నటసింహ బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రం లో దబిడి దిబిడి అంటూ క్రేజీ గ్లామర్ స్టెప్స్ తో ఉర్రూతలూగించిన ఊర్వశి రౌతేల్ల ఓ వింత కోరిక కోరింది. తనకి సౌత్ లో అభిమానులు గుడి కట్టాలంటూ ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. సౌత్ లో అందులోను టాలీవుడ్ లో సమంత కు ఆమె అభిమానులు గుడి కట్టి పూజలు చేశారు. ఇక తమిళనాట ఖుష్బూ కి హన్సిక కు తమిళ తంబీలు గుడి కట్టి పూజించారు.
దబిడి దిబిడి సాంగ్ కాంట్రవర్సీ విషయంలో ఊర్వశి తన వ్యాఖ్యలతో హైలెట్ అవుతూ ఉంది. తాజాగా తనకి సౌత్ లో గుడికట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆమెను వార్తల్లో నిలిచేలా చేసాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నాకు గుడి కట్టారు. మీరెప్పుడైనా బద్రీనాథ్ టెంపుల్ కు వెళ్లినప్పుడు ఆ గుడి పక్కనే నా గుడి కనిపిస్తుంది.. ఈసారి నా గుడి కూడా సందర్శించండి అని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఢిల్లీలోనూ ఓ యూనివర్సిటీలో నా ఫోటోకు పూలమాల వేసి దండమామాయి అంటూ నన్ను పిలుస్తారు, అది విని నేను షాకయ్యను. నేను సౌత్ లో స్టార్ హీరోలైన చిరు, పవన్, బాలకృష్ణ లతో నటించాను, నాకు సౌత్ లోను కూడా అభిమానులున్నారు. సౌత్ లో నా అభిమానులు కూడా నాకు గుడి కట్టాలని తాను కోరుకుంటున్నట్టుగా ఊర్వశి రౌతేల్ల చెప్పుకొచ్చింది.
అది విన్న నెటిజెన్స్ సౌత్ లో ఈపాటి క్రేజ్ కే నీకు గుడి కట్టాలా తల్లీ అంటూ కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు.