యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి నాలుగు రోజుల క్రితమే షార్ట్ వెకేషన్ కి వెళ్లారు. అన్న కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ ఆతర్వాత ఫ్యామిలీని తీసుకుని షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కారు.
షార్ట్ ట్రిప్ ఎందుకన్నామంటే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్ లోకి వెళ్ళబోతున్నారు. అందుకే ఫ్యామిలీతో కలిసి సరదాగా నాలుగు రోజులు గడిపేందుకు ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు. ఈ నాలుగు రోజుల్లో అక్కడ అభిమానులతో కలిసి ఫొటోస్ దిగడమే కాదు ఫ్యామిలీ తో అంటే భార్య ప్రణతి, కుమారులు భార్గవ్, అభయ్ లతో కలిసి ఎంజాయ్ చేసారు.
ఇక ఆ చిన్నపాటి వెకేషన్ ముగించుకుని ఎన్టీఆర్ గత రాత్రి ఫ్యామిలీతో సహా దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ చిన్నకుమారుడిని దగ్గరుండి తీసుకురాగా ప్రణతి పెద్ద కుమారుడితో కలిసి నడిచోస్తూ కనిపించారు. ఇక ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు నీల్ సెట్ లోకి ఎంటర్ అవుతారా అని అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. ఆ కల ఈ నెల 22 న నెరవేరబోతుంది.