Advertisementt

హోటల్ పై నుంచి దూకి పారిపోయిన నటుడు

Thu 17th Apr 2025 08:29 PM
shine tom chacko  హోటల్ పై నుంచి దూకి పారిపోయిన నటుడు
Shine Tom Chacko escapes hotel during drug raid హోటల్ పై నుంచి దూకి పారిపోయిన నటుడు
Advertisement
Ads by CJ

ప్రముఖ మలయాళ నటుడు, నాని దసరా మూవీ విలన్ టామ్ చాకో షైన్ కొచ్చి లోని ఓ హోటల్ పై అంతస్తు నుంచి పారిపోతున్న వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. టామ్ చాకో షైన్ కొచ్చి లోని ఓ హెటల్ రూమ్ తీసుకుని అక్కడ మాధకద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా నార్కోటిక్ పోలీసులకు సమాచారం అందడంతో.. వారు ఆ హోటల్ పై రైడ్  చేసేందుకు వచ్చిన సమయంలో టామ్ చాకో షైన్ హోటల్ పై అంతుస్తు నుంచి దూకి తప్పించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

నార్కోటిక్ పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న టామ్ చాకో షైన్ కొచ్చి లోని ఓ హోటల్ మూడో అంత‌స్తు కిటికీ ద్వారా సెకండ్ ఫ్లోర్‌లోకి దూకి మెట్ల మార్గంలో ప‌రుగులు పెట్టినట్లుగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే తెలుస్తుంది.

ఇప్పటికే టామ్ చాకో షైన్ పై మలయాళ ఫిలిం అసోసియేషన్ అమ్మ లో ఫిర్యాదు నమోదు అయ్యింది. టామ్ చాకో షైన్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని విన్సీ అలోషియస్ అనే న‌టి మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. 

Shine Tom Chacko escapes hotel during drug raid:

Shine Tom Chacko flees hotel room during police raid in Kochi

Tags:   SHINE TOM CHACKO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ