నిజమే సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో నార్త్ లోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత రాజ్ అండ్ డీకే తో ట్రావెల్ చేస్తుంది. ఫ్యామిలీ 2 మ్యాన్ వెబ్ సీరీస్ తో పాటుగా సిటాడెల్ వెబ్ సీరీస్ లు చేసింది. అందులో ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ అవ్వగా సిటాడెల్ హాని-బన్నీ సో సో గా సరిపెట్టుకుంది. ఆ తర్వాత సమంత సౌత్ కి బ్రేకిచ్చేసి నార్త్ లోనే పాగా వేసింది.
ప్రస్తుతం రాజ్ అండ్ డీకే ప్రొడ్యూసర్స్ గా రక్త్ బ్రహ్మాండ్ సీరీస్ చేస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ వారు సమంత అభిమానులకు బిగ్ షాకిచ్చారు. సిటాడెల్ వెబ్ సీరీస్ రిజల్ట్ సో సో గా నిలవడంతో దానికి సీక్వెల్ చేసినా వర్కౌట్ అవ్వదనుకున్నారో ఏమో అమెజాన్ ప్రైమ్ వారు ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అది సిటాడెల్ సీక్వెల్ సిటాడెల్ 2 ని ఆపేసినట్లుగా తెలుస్తుంది. సమంత-వరుణ్ ధావన్ జంటగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిటాడెల్ అంతగా ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది అనే చెప్పాలి. అందుకే అమెజాన్ వారు సిటాడెల్ 2 ని ఆపేసినట్లుగాబాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.