మలయాళ హీరోయిన్, ప్రముఖ హీరో ఫహద్ ఫాసిల్ భార్య నజ్రియా మొదటి నుంచి ఆచితూచి సినిమాలు చేస్తుంది. తెలుగులో నాని హీరోగా అంటే సుందరానికి చిత్రం తర్వాత ఆమె మళ్లీ మలయాళంలో తెరకెక్కిన సూక్ష్మ దర్శిని చిత్రంతో పాపులర్ అయ్యింది. ఆ చిత్రం మల్టిపుల్ లాంగ్వేజెస్ లోను ఓటీటీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ అయ్యింది.
అయితే కొన్నాళ్లుగా నజ్రియా సోషల్ మీడియాకి బ్రేకిచ్చి ఎవ్వరికి కనిపించడం లేదు. తాజాగా ఆమె అభిమానులకు, సన్నిహితులకు ఓపెన్ లెటర్ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజులుగా తాను డిప్రెషన్ లో ఉన్నట్లుగా చెప్పి షాకిచ్చింది. అంతేకాదు న్యూ ఇయర్ వేడుకలకు, అలాగే సూక్ష్మదర్శిని విజయాన్ని అందరితో పంచుకోలేకపోయినందుకు సారీ చెబుతుంది.
తను వ్యక్తిగత సవాళ్లతో సతమతమవుతున్నానని, అందుకే అభిమానులకు, ఆప్తులకు దూరంగా ఉన్నానని ఓపెన్ లెటర్‌లో తెలపడమే కాదు, డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అందుకే అందరిని క్షమించమని ఆమె కోరారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను అని, పూర్తి స్థాయిలో కోలుకున్నాక తాను అందరిని కలుస్తాను అంటూ నజ్రియా తన ఓపెన్ లెటర్లో పేర్కొంది.
అయితే నజ్రియా ఇంత సడన్ గా డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళింది, అసలు డిప్రెషన్ కి కారణమేమిటి, సోషల్ మీడియాలో నజ్రియాకు, అలాగే ఫహద్ ఫాసిల్ కి మద్యన విభేదాలు రావడంతో విడాకుల వైపు అడుగులు వేస్తున్నారనే న్యూస్ ప్రచారంలో ఉంది. అందుకే నజ్రియా డిప్రెషన్ ను ఫేస్ చేస్తుందా అనే అనుమానాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.