దర్శకధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ కి ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో రాజమౌళి ఎక్కువ సినిమాలే తెరకెక్కించారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల్లో ఎన్టీఆర్-రాజమౌళి కలిసి పని చేసారు. రాజమౌళి ఎన్టీఆర్ ఏంతో ప్రేమగా జక్కన్న అని పిలుస్తారు. తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ యాక్టింగ్ పై ప్రశంశల వర్షం కురిపించారు.
తారక్ గొప్ప నటుడు అంటూ పొగిడేశారు. రాజమౌళి రీసెంట్ గా జపాన్ వెళ్లారు. అక్కడ ఆర్.ఆర్.ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి కొమరం భీముడొ పాట గురించి మాట్లాడారు. కొమరం భీముడొ పాటను చిత్రీకరించడం నాకు చాలా తేలికైంది. కారణం తారక్ ఆ పాటలో అణువణువునా హావభావాలు పలికించారు. అతను గొప్ప నటుడు, ఆ విషయం అందరికి తెలుసు. కానీ ఆ పాటలో ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.
నేను ఆ పాటలో తారక్ ఫేస్ పై కెమెరా పెట్టి చిత్రీకరించాను, అంతే ఆ పాట ఏంతో అద్భుతంగా వచ్చింది. తారక్ మాత్రమే కాదు ఆ పాట సక్సెస్ వెనుక కొరియోగ్రాఫర్ మ్యాజిక్ కూడా ఉంది. తారక్ ని ఎలా కట్టెయ్యాలి, ఎలా వేలాడదీయలో బాగా అలోచించి కొరియోగ్రఫీ చేసారు అంటూ రాజమౌళి తారక్ ను పొగిడిన వీడియో వైరల్ గా మారింది.