రాజమౌళి-మహేష్ కలయికలో జనవరిలో సైలెంట్ గా మొదలైన SSMB 29 షూటింగ్ ఒడిశా షెడ్యూల్ పూర్తయ్యాక మహేష్ ఫ్యామిలీతో కలిసి ఇటలీ రాజధాని రోమ్ కి వెకేషన్ కి వెళ్లగా, దర్శకుడు రాజమౌళి జపాన్ వెళ్లారు. ఆయన అక్కడి పనులు పూర్తి చేసుకుని జపాన్ నంచి తిరిగొచ్చారు. మహేష్ కూడా వెకేషన్ నుంచి సింగిల్ గా హైదరాబాద్ వచ్చేసారు.
రాజవుళి-మహేష్ అందుబాటులోకి వచ్చెయ్యడంతో SSMB 29 తదుపరి షెడ్యూల్ షురూ అయ్యింది అని తెలుస్తోంది. అది లండన్ లోనా లేదంటే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో SSMB 29 తదుపరి షెడ్యూల్ మొదలవుతుందో అనేది తెలియాల్సి ఉంది. ఈ షెడ్యూల్ లోను మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉంటారని తెలుస్తోంది.
రాజమౌళి ప్రస్తుతం SSMB 29 తదుపరి షెడ్యూల్ కోసమే కాదు.. మహేష్ అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లతో కలిసి మీడియా ముందుకు రావడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారని టాక్.