తనదైన ఛరిష్మాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియాలో "మాయాజాలం" సృష్టించడంలో సక్సెసయ్యాడు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డాయాస్పోరాలో అభిమానులేర్పడ్డారు. అయితే అతడిని కేవలం ఇండియన్లు మాత్రమే కాదు జపనీలు ఇతర దేశాల ప్రజలు కూడా అభిమానిస్తున్నారు. ఇప్పుడు స్పెయిన్ ప్రజలకు కూడా ప్రభాస్ పరిచయం కాబోతున్నాడు. అది కూడా బాహుబలి సినిమాతో.
2015లో విడుదలైన "బాహుబలి ది బిగినింగ్" భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటి. ప్రభాస్, అనుష్క శెట్టి నటించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 650.00 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా అనేక భారతీయ భాషలలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఆపిల్ టీవీ + వంటి ఓటీటీల్లో విదేశీ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన దాదాపు దశాబ్దం తర్వాత ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్పానిష్ భాషలోకి డబ్బింగ్ అయింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా చేయడంతో మరో దేశంలో ప్రభాస్ కి అభిమానుల బలం పెరగనుంది. బాహుబలి సినిమా ప్రేక్షకులను విస్తృతంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక్కో దేశంలో ప్రభాస్ తన అభిమానులను పెంచుకుంటున్నాడు. భాషతో సంబంధం లేకుండా అతడి ఖ్యాతి అంతకంతకు విస్తరిస్తోంది.