సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కిన జైలర్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో బాగా వర్కౌట్ అయ్యింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లు గెస్ట్ రోల్స్ లో కనిపించడం ఆ చిత్ర విజయానికి హెల్ప్ అయ్యింది. జైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ జైలర్ లో బాలయ్య కూడా భాగమైతే బావుండేది అన్నారు.
ఇప్పుడు జైలర్ 2 పట్టాలెక్కింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రీకరణలో కేరళలో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రంలో బాలయ్య కూడా నటిస్తారనే టాక్ మొదలైంది. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ ఈవెంట్ లో కనిపించగా టాలీవుడ్ మీడియా జైలర్ 2 చిత్రంలో బాలయ్య నటిస్తారా అనే ప్రశ్నకు శివరాజ్ కుమార్ కాస్త తికమకగా సమాధానమిచ్చారు.
జైలర్ 2లో బాలయ్య నటిస్తున్నారు అనే విషయం నాకు తెలియదు, జైలర్ 2లో తన పాత్ర ఉందని మాత్రం దర్శకుడు నెల్సన్ చెప్పారని తెలిపారు. బాలయ్య కూడా మూవీలో ఉంటే బాగుంటుందని శివరాజ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.