కోలీవుడ్ నటి శృతిహాసన్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయినప్పుడు టాలీవుడ్ లో వరస ఆఫర్స్ దక్కించుకోవడమే కాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా అందుకుంది. ఆతర్వాత కోలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేసిన శృతి హాసన్ కు గత ఏడాది బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి.
కారణం ఆమె తన ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకోవడమే కాదు టాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. అంతేకాదు తమిళనాట కూడా శృతి హాసన్ మరో ప్రాజెక్ట్ వదులుకుంది అనే టాక్ ఉంది. అదేసమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రంలో కీ రోల్ లో కనిపించబోతుంది.
ఇక సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ అలాగే వ్యక్తిగత విషయాలను మొహమాటం లేకుండా షేర్ చేసే శృతి హాసన్ తాజాగా వదిలిన పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లూజ్ హెయిర్ తో కత్తిలాంటి లుక్స్ తో శృతి హాసన్ నిజంగా అద్దరగొట్టేసింది. శృతి హసన్ ఈ కొత్త ఫోజులు చూస్తే దర్శకనిర్మాతలెవ్వరైనా తమ సినిమాల్లో అవకాశం ఇవ్వాల్సిందే.