పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరమల్లు మే 9 రీలీజ్ అంటూ నిన్నగాక మొన్న కూడా మేకర్స్ పోస్టర్ వదిలి మరీ కన్ ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాన్ డబ్బింగ్ స్టార్ట్ చేస్టున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ కోసం సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది.
సింగపూర్ నుంచి రాగానే కొడుకుని భార్య కు అప్పజెప్పి ఆయన పని లో పడిపోయారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మరో ప్రాబ్లం వచ్చి పడింది, కాదు కాదు ఆయన నిర్మాతలకు మళ్లీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. కారణం పవన్ కళ్యాణ్ కి వెన్ను నొప్పి తిరగబెట్టింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ కి వెళ్లకుండా పవన్ వెనుదిరగడం హాట్ టాపిక్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఆయన సమావేశానికి బయలుదేరి దగ్గరలోనే ఉన్న సమయంలో వెన్ను నెప్పి ఇబ్బంది పెట్టడంతో అటునుంచి అటే ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పడు హరి హర వీరమల్లు విడుదలకు రెడీ అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇలా అనారోగ్యం పాలవడం సినిమా విడుదలపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందేమో అని పవన్ ఫ్యాన్స్ దిగులుపడుతున్నారు.