కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కల్వకుంట్ల కవిత ఎంతగా చెలరేగిపోయిందో, అన్న కేటీఆర్ తో పోటీపడి మరీ రాజకీయాలు చేసిన కవితను 2023 తెలంగాణా ఎన్నికల టైమ్ లో లిక్కర్ స్కామ్ లో కేసు పెట్టి జైల్లో వేశారు. కొన్ని నెలలు జైలులో ఉన్న కవిత జైలు నుంచి బయటికొచ్చాక కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ రాజకీయాలు మొదలు పెట్టింది.
BRS రజతోత్సవ సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. BRS నేతలను ఏ కాంగ్రెస్ నేతలు, అధికారులు ఇలా ఎవరెవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను బారాబర్ పింక్ బుక్ లో రాస్తాం.. కేసీఆర్ సార్ మంచోడు కావొచ్చు, నేను కొంచెం రౌడీ టైప్.. ఎవరు అయితే బెదిరిస్తున్నారో వారి పేర్లు రాసి వారి భరతం పడతాం. అధికారులు కావచ్చు, నేతలు కావొచ్చు ఎవ్వరిని వదలం, మీ తాటాకు చప్పుళ్లకు భయపడము, అందరి తాట తీస్తాం అంటూ కాస్త ఫైర్ చూపించింది.
అటు కవిత నారా లోకేష్ రెడ్ బుక్ ను కాపీ కొట్టడం టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు నవ్వు తెప్పించింది. ఏంటి కవితక్కా మా లోకేష్ అన్నను కాపీ కొడుతున్నావ్ అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు. నారా లోకేష్ 2024 ఎన్నికల ముందు ఏపీలో రెడ్ బుక్ రాసి అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తామని చెప్పినట్టుగా ఇక్కడ తెలంగాణలో పలువురు BRS నేతలు పింక్ బుక్ మొదలు పెడతామని చెప్పుకోవడమే అందరికి కామెడీగా మారింది.