గత వారం విడుదలైన జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయ్ చిత్రాలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. అందుకే ఈ వారం విడుదల కాబోతున్న చిత్రాలపై ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. సమ్మర్ హాలిడేస్, కాసేపు అలా థియేటర్ కి వెళ్లి రిలాక్స్ అవుదామంటే ఆయమన్న సినిమాలు లేవు, దానితో బోర్ కొడుతున్న ప్రేక్షకులు ఈవారం చిత్రాలపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
ఈ వారం క్రేజీ చితాలుగా సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా నటించిన ఓదెల 2, అలాగే కళ్యాణ్ రామ్, విజయశాంతి కలయికలో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాలు వాటితో పాటుగా రవితేజ నా ఆటోగ్రాఫ్ చిత్రం రీ రిలీజ్ కి సిద్దమైంది.
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు-వెబ్ సీరియస్ లు
నెట్ ఫ్లిక్స్:
ది గ్లాస్ డోమ్ (వెబ్ సిరీస్ - ఏప్రిల్ 15)
ఐ హోస్టేజీ (మూవీ - ఏప్రిల్ 18)
అమెజాన్ ప్రైమ్ :
గాడ్ ఫాదర్ ఆఫ్ హాలెం (వెబ్ సిరీస్ - ఏప్రిల్ 13)
ఖౌఫ్ (హిందీ సిరీస్ - ఏప్రిల్ 18)
జియో హాట్ స్టార్ :
ది లాస్ట్ ఆఫ్ ఆజ్ 2 (వెబ్ సిరీస్ - ఏప్రిల్ 14)
ది స్టోలెన్ గర్ల్ (వెబ్ సిరీస్ - ఏప్రిల్ 16)
సోనీ లివ్ :
చమక్: ది కన్‌క్లూజన్ (హిందీ సిరీస్ - ఏప్రిల్ 14)