అల్లు అర్జున్ ఒక్కసారి అట్లీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయితే అయన ఎప్పుడు ఫ్రీ అవుతారో చెప్పలేరు. అనుకున్న సమయానికి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ పూర్తవుతాయనే గ్యారెంటీ కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అందుకే అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇప్పుడో మాస్టర్ ప్లాన్ చేసారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసేవరకు త్రివిక్రమ్ ఖాళీగా ఉండలేరు, కాబట్టే ఆయన మరో హీరో అంటే సీనియర్ హీరో వెంకటేష్ తో ఓ మూవీ ప్లాన్ చేసుకుంటున్నారట. వెంకటేష్ కూడా ప్రస్తుతం రానా-నాయుడు వెబ్ సీరీస్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత వెంకీ ఇంకా ఏ దర్శకుడితోనూ కమిట్ అవ్వలేదు.
త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో చెయ్యబోయే సినిమా పనుల్లో బిజీ కాబోతున్నారట. త్వరలోనే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన వస్తోంది అని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ కోసం వెయిట్ చెయ్యకుండా త్రివిక్రమ్ అలా వెంకీ తో ప్లాన్ చేశారన్నమాట.